Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా సాగుతుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల మద్దతుతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఇతరుల సహాయం ఉంటుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని పనుల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండడమే మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు తిరిగి అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరి అవకాశముంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఇదే మంచి సమయం.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండడంతో శత్రువులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి తోటి వారి సహకారం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరిగిన దానికి తగిన విధంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొన్ని ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల అనుగ్రహంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. శని దేవుడి అనుగ్రహంతో శత్రులపై విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు పొందుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరపు వివాదాల్లోకి తరచూచకుండా ఉండడమే మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి పదోన్నతులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
