Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాసులపై గురువారం మృగశిర, రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గౌరీ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు కొత్త ఒప్పందాలు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సంబంధించిన విషయాల్లో వార్తలు వింటారు. అదనపు ఖర్చులు పెరుగుతాయి. అయితే అందుకు సంబంధించిన ఆదాయాన్ని వచ్చే మార్గాన్ని చూడాలి. లేకుంటే నష్టాల్లో పడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండదు. ప్రియమైన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం క్షమించే అవకాశం ఉంది. కొత్త జీవితం ప్రారంభించిన వారికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు లాభనష్టాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇవి లాభాలనే తీసుకొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సంతోషంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ప్రియమైన వారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మాటలు మాధుర్యంతో సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. తోటి వారి మద్దతుతో కొత్త పనులను పూర్తి చేస్తారు. లక్ష్యాలను చేరడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. అధికారుల నుంచి వీరికి మద్దతు ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వండుతాయి. డబ్బు కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాల వల్ల వ్యాపారులు అధికంగా లాభపడతారు. ఇంట్లోకి చుట్టాలు రావడం వల్ల తొందరగా మారుతుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం లేకుంటే ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యాపారులు లాభాల కోసం కష్టపడాల్సి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా కొత్త ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . మీ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ఐటీ రంగంలో పనిచేసే వారికి అనుకోకుండా ఆదాయం లభిస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టుల ద్వారా అధికంగా లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు అధికంగా లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వీరికి తోటి వారి అండ ఉండడంతో కొత్త పనులను పూర్తి చేస్తారు. ప్రియమైన వారికోసం బహుమతులకు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాజుగారు ఈరోజు కుటుంబంతో సరదాగా ఉంటారు. వ్యాపారులకు అధికంగా లాభాలు వస్తాయి. అయితే ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొందరు ముఖ్యమైన పనులకు అడ్డంకులు సృష్టించడానికి రెడీ అవుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు. ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోవడమే మంచిది. కుటుంబం కోసం కొన్ని ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా అలసిపోయినట్లు కనిపిస్తారు. స్నేహితులను కలవడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు అదనంగా ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమయాల్లో మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొన్న స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా మారుతారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. దూర ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్న ఆదాయం రావడంతో మనం లభిస్తుంది. ఉద్యోగులు గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అయితే సీనియర్లతో ఇలాంటి వాదనలకు దిగకుండా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా బలపడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారులతో వాదనలకు దిగకుండా ఉండాలి. తోటి వారి మద్దతుతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఒప్పందాలు చేసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా గొప్ప విజయం లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో మాటలు విషయంలో వాగ్వాదం ఏర్పడుతుంది. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నేహితుల ద్వారా ధన సహాయమందుతుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు.