spot_img
Homeప్రత్యేకంToda tribe traditions : మగవాళ్ళు పౌరుషాన్ని నిరూపించుకోవాలి.. అమ్మాయిని గర్భవతిని చేయాలి.. అప్పుడే పెళ్లి

Toda tribe traditions : మగవాళ్ళు పౌరుషాన్ని నిరూపించుకోవాలి.. అమ్మాయిని గర్భవతిని చేయాలి.. అప్పుడే పెళ్లి

Toda tribe traditions : పై శీర్షిక చదివిన తర్వాత వింతగా అనిపించింది కదా.. ప్రపంచం మొత్తం అరచేతిలో కనిపిస్తున్న నేటి రోజుల్లో ఇటువంటి సాంప్రదాయం ఏంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది మీకు వింతేమో.. ఆశ్చర్యమేమో.. కానీ వీళ్ళకు మాత్రం కాదు. ఎందుకంటే.. వీరికి అది సాంప్రదాయం.. తరతరాలుగా వస్తున్న ఆచారం.

మనదేశంలో దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాలలో అనేక తెగలు నివసిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెగలు దక్షిణ భారతదేశంలో అధికంగా ఉంటాయి. ఆ తెగలలో విచిత్రమైన సాంప్రదాయాలు.. వినూత్నమైన ఆచారాలు కనిపిస్తుంటాయి. ఇటువంటి ఆచారాన్ని.. సంప్రదాయాన్ని కొనసాగించే జాతుల్లో తోడా తెగ ఒకటి. వీరు తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి కొండల్లో నివసిస్తూ ఉంటారు. వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ, అమ్మకం వీరి ప్రధాన వృత్తులు.. తోడా తెగవారు సామూహిక జీవితాన్ని ఇష్టపడుతుంటారు. అందువల్లే వారిలో ఐక్యత కనిపిస్తూ ఉంటుంది.

ఐక్యతను ప్రదర్శించడంలో వీరి తరువాతే ఎవరైనా. ఏదైనా ఆపద వస్తే అందరూ మూకుమ్మడిగా కలిసిపోయి.. తమ చైతన్యాన్ని నిరూపించుకుంటారు. అంతేకాదు.. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా మీరు వినూత్నమైన విధానాలను అవలంబిస్తారు. వేటలో కూడా దూకుడు తనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.. నేటి కాలంలో వేట తగ్గిపోయినప్పటికీ అటవీ ఉత్పత్తుల సేకరణ మాత్రం ఆగలేదు. పైగా వీరు ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో దుస్తులు తయారు చేస్తుంటారు. అది వీరి కళాకృతికి బలమైన నిదర్శనంగా నిలుస్తుంది.

తోడా తెగ వారిలో వింత ఆచారం ఒకటి ఉంటుంది. సాధారణంగా ఆదిమ తెగలలో బహు భార్యత్వం ఉంటుంది. ఈ తెగల మాత్రం బహు భర్తృత్వం ఉంటుంది. ఈ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ ఒక కుటుంబంలో తన భర్తతో పాటు అతడి సోదరులను కూడా పెళ్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెళ్ళికి ముందు యువకులు 100 కిలోల రాయిని ఎత్తాలి. తమ పౌరుషత్వాన్ని నిరూపించుకోవాలి. ఆ తర్వాత తాము ఇష్టపడిన అమ్మాయిని మెప్పించాలి. అనంతరం ఆమెతో కలిసి జీవనం మొదలుపెట్టాలి. అలా ఆరు నెలల తర్వాత ఆమె గర్భం దాల్చాలి. అప్పుడే విల్లు అంబు అనే ఉత్సవంలో ఆ ఇద్దరి వివాహానికి అధికారికంగా గుర్తింపు లభిస్తుంది.

ఒకవేళ గర్భం దాల్చకపోతే.. అప్పుడు ఆ తెగ పెద్ద మనుషులు చెప్పినట్టు నడుచుకోవాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని మాత్రం నెల తప్పించాలి. ఎందుకంటే సంతతి వృద్ధి చెందితేనే తమ జాతి బాగుంటుందని తోడా తెగవారు భావిస్తారు. అందువల్లే ఈ నిబంధన పెట్టారు. మిగతా వారికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. వింతగా అనిపించినప్పటికీ.. తోడా తెగ వారు మాత్రం ఈ సాంప్రదాయాన్ని తమకు పూర్వికులు ఇచ్చిన అదృష్టంగా భావిస్తుంటారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version