Tirumala temple controversy : లడ్డులో కల్తీ నెయ్యిని వాడారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వేదికగా చేసుకున్నారు. స్వామివారి పరకామణిలో హుండీ డబ్బులు లెక్కిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తమకు అనుకూలమైన వారికి దర్జాగా దర్శనం ఇప్పించారు. లెక్కపత్రం లేకుండా స్వామివారి నిధులు వాడారు. చివరికి గోపురానికి బంగారు తాపడం చేయించే విషయంలో కూడా దారుణంగా ప్రవర్తించారు…

ఇలా చెప్పుకుంటూ పోతే వైసిపి పరిపాలన కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత ఆగం కావాలో అంత ఆగమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. ఒకరకంగా వైసిపి పరిపాలన కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వనాశనం చేశారు. అన్య మతస్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో చేర్చారు. ఇంకా చెప్పాలంటే.. తమ ప్రయోజనాలకు అనుగుణంగా స్వామివారి ఆలయాన్ని మార్చారు. తద్వారా భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు…

కల్తీ నెయ్యి వాడి లడ్డూలను తయారు చేయడం మాత్రమే కాకుండా.. ఇంకా బుకాయింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కిరాయి వ్యక్తులతో రకరకాల చేష్టలు చేస్తున్నారు. ఆమధ్య కొంతమంది కిరాయి వ్యక్తులకు గంజాయి ఇచ్చి.. వారితో తాగించి.. ఆ ఫోటోలను.. వీడియోలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో.. మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగి. వ్యవహారం పై లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి మీడియాలో పనిచేసే కొంతమంది వ్యక్తులు.. వైసిపి నాయకులు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.
వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ లో కూడా స్వామివారిని తమ రాజకీయాలకు వాడుకుంటున్నారు. హిందువులు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు.. బూట్లు వేసుకొని మండలిలో ప్రదర్శించారు. తద్వారా వెంకటేశ్వర స్వామి కి మహాపరాధం చేశారు. వెంకటేశ్వర స్వామి హిందువులకు అత్యంత నమ్మకమైన దేవుడు. తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రతిరోజు వేలాదిమంది హిందువులు వెళ్తుంటారు. స్వామి వారి దర్శనం సమయంలో కనీసం ప్యాంట్ కూడా వేసుకోరు. సంప్రదాయమైన పంచ లేదా కుర్తా ధరించి స్వామివారిని దర్శించుకుంటారు.
భక్తులు దర్శనం విషయంలో వెంకటేశ్వర స్వామికి అమితమైన సంప్రదాయాన్ని పాటిస్తుంటే.. వైసిపి నాయకులు మాత్రం ఇలా బూట్లు ధరించి.. స్వామివారికి మహా పరాధం చేస్తున్నారు. చివరికి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వైసిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.