Tirumala Devotees Protest: తిరుమలలో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నరకయాతన అనుభవిస్తుండగా, టీటీడీ విధానాలపై వారి ఆగ్రహం బహిరంగంగా బయటపడింది. “డౌన్ డౌన్ టీటీడీ ఈవో శ్యామలరావు”, “డౌన్ డౌన్ ఛైర్మన్ బీఆర్ నాయుడు” అంటూ నినాదాలు చేశారు. వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఇచ్చి, సామాన్య భక్తుల అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారనివైసీపీ ఆక్షేపించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది.