
మంత్రి కేటీఆర్ చొరవతో ఓ గర్భిణీకి సకాలంలో వైద్యం అందింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం వాసి వినయ్ కుమార్ సోదరి గర్భంతో ఉంది. కాన్పు కోసం కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో వెంటనే కేటీఆర్ కి ట్విట్టర్ లో సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. కేటీఆర్ చొరవతో కోదాడ పురపాలక సిబ్బంది సంబంధిత ఆస్పత్రిలో వైద్యం అందేలా చూశారు. సమస్యను పరిష్కరించిన మంత్రి కేటీఆర్ కు మున్సిపాలిటీ సిబ్బందికి వినయ్ కృతజ్ఞతలు తెలిపాడు.