
రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకుంటే బెంగళూరు సహా పలు జిల్లాలకు పెనుముప్పు తప్పదని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ సైన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకుండా ఇదే తరహా లో వదిలి పెడితే బెంగళూరులో జూన్ ఆఖరుకు 33 లక్షల కరోనా కేసులు నమోదు కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఐఐఎస్ సీ ప్రొఫెసర్ లు శశికుమార్ గణేశన్, దీపక్ సుబ్రమణిల నేతృత్వంలో అధ్యయన సమితి నివేదిక రూపొందింది. కరోనాకు బ్రేక్ పెట్టాలంటే నెల రోజుల కఠిన లాక్ డౌన్ ఒక్కడే పరిష్కారమని తేల్చారు. ఒక వేళ అమలు చేయకుంటే 30 రోజుల్లో బెంగళూరులో 14.99 లక్షలు, ఆ తర్వాత మంరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు.