
ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ఇచ్చిన జీవో 34 పై కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ రామచంద్రారావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ ను సీజే ధర్మాసనం ముందుంచాలని తెలంగాణ ఏజే ప్రసాద్ కోరారు. విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని ధర్మాసనం పేర్కొంది. ఏజీ స్థాయి అధికారి నుంచి అసమంజస అభ్యర్థన సరికాదని పేర్కొంది. ఇది ధర్మాసనంపై దాడేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించింది. దీనిపై రేపు వాదనలు వినిపిపంచాలని పిటిషనర్, కేంద్రం, తెలుగు రాష్ట్రలను ఆదేశించింది.