
నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. నెలలో 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని ఆర్థిక స్థితి ప్రస్తుతం ఏపీలో ఉందని అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు.