Viral Video : ఇప్పటివరకు సినిమాలలో విఎఫ్ఎక్స్ ద్వారానే డిజిటల్ షాట్స్ తీసేవారు. ప్రేక్షకులకు సరికొత్త ఊహాలోకాన్ని.. అంతరసాధ్యమైన మాయ ప్రపంచాన్ని దాని ద్వారా నిర్మాతలు అందించేవారు. ఇకపై విఎఫ్ఎక్స్ ను మర్చిపోవాల్సిందే. ఎందుకంటే దాని స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా ప్రపంచాన్ని శాసించనుంది. ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎటువంటి సినిమాలు రూపొందించకపోయినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో దాని ద్వారానే సినిమాలు తీసే అవకాశం లేకపోలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలలో విఎఫ్ఎక్స్ లోపాలు కనిపించాయని సినీ విమర్శకులు పెదవి విరిచారు. అయితే ఇకపై విఎఫ్ఎక్స్ ద్వారా సినిమాలలో సాంకేతిక హక్కులు జోడించాల్సిన అవసరం లేదని.. ఆ పని మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుందని సాంకేతిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు..”ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు చాలా రంగాలలో సంచలనాత్మక మార్పులకు కారణమైంది. దీనివల్ల అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.. అది ఎంతటి మార్పులకు కారణం అవుతుందో ఇప్పుడైతే చెప్పలేం గాని.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇప్పటివరకు వాడిన సాంకేతికత వెనక్కి వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సినీ పరిశ్రమను ఏలేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదని” సాంకేతిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
EiPi సీఈవో ఏం చేశారంటే..
త్వరలో మహాభారతం సినిమా తెరమీదకి రానుంది.. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇది తెరమీదకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. భారీగా సెట్టింగ్లు నిర్మిస్తున్నారు. ఇంకా వీ ఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేస్తున్నారు. దానికంటే ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సహాయంతో EiPi కంపెనీ సీఈవో ఏకంగా మహాభారతాన్ని సినిమాగా రూపొందించారు. అసలు ఏమాత్రం సాంకేతికత వాడినట్టు చూపించకుండా.. అత్యంత సహజత్వంతో దానిని రూపొందించారు. దానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇప్పటికే ఇది లక్షల కొద్ది వీక్షణలు సొంతం చేసుకుంది. చూసిన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ” అద్భుతంగా ఉంది. మహాభారతం కళ్ళ ముందు కనిపిస్తోంది. నాటి యుద్ధాలు, రాజులు, రాణులు, సామ్రాజ్యాలు కనులకు విందుగా ఉన్నాయి. ఇలాంటి అద్భుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ భవిష్యత్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా రంగాన్ని ఏలుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇలాంటి సాంకేతికతలు చూపించే వ్యతిరేక ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొంతమంది సాంకేతిక నిపుణులకు ఉపాధి దూరమవుతుందని ” ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.