
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ కు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాని చెప్పారు. ఈటలతో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని వివరించారు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నా అని గంగుల అన్నారు.