
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ జట్టు ఐర్లాండ్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం దక్కినట్లైంది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స కు చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే.