Hyderabad News: సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఇది సైన్స్. జీవితానికి కూడా పనిచేస్తుంది. లోకంలో ఆడ, మగ పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. వారు సంసారం చేసి పిల్లల్ని కనడం తెలిసిందే. అది సహజమే. కానీ ఇక్కడ విరుద్ధంగా స్వలింగ సంపర్కులు అయిన ఇద్దరు మగవారు పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఇద్దరు ఆడవారు పెళ్లిళ్లు చేసుకోవడం చూశాం కానీ ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవాలని అనుకోవడం ఇదే ప్రథమం. దీంతో అందరి దృష్టి వారిపైనే పడింది. అసలు దీనికి కారణాలేమిటి అని ఆరా తీస్తే విస్తు గొలిపే నిజాలు వెల్లడవుతున్నాయి.
హైదరాబాద్(Hyderabad News) కు చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు మగవారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఎనిమిదేళ్లుగా వీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకున్నారట. వీరి ప్రేమకు ఓ డేటింగ్ యాప్ వేదికైంది. దీంతో వారు తమ ఊసులు చెప్పుకున్నారు. తమ ఆశలు తీర్చుకోవడానికి ఒక్కటి కావాలని నిశ్చయించుకున్నారు. సాధారణంగా ఆడ, మగ కలిసి పెళ్లి చేసుకోవడంతో పాటు సంసారం చేయడం చూస్తుంటాం. కానీ ఇద్దరు మగవారు పెళ్లి చేసుకోవడం ఏమిటని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీరి పెళ్లికి పెద్దలు కూడా ఆమోదం తెలపడంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని పెళ్లిళ్లలో మాదిరిగానే మంగళస్నానాలు, ఉంగరాలు మార్చుకునే సంప్రదాయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. సాధారణ పెళ్లి వలె ఈ వివాహం కూడా జరుగుతుందని వారి బంధువులు పేర్కొంటున్నారు.
స్వలింగ సంపర్కుల వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు పెద్దలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ వైవాహిక బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు వారు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలోనే మొదటిసారిగా జరిగే మగవారి పెళ్లికి అందరిలో ఆసక్తి నెలకొంది.