https://oktelugu.com/

Venuswami : రెండోసారి అడ్డంగా బుక్కైన వేణుస్వామి.. ఇక అరెస్ట్ కాక తప్పదేమో..భలే దొరికేశాడుగా!

వేణు స్వామి మహిళా కమీషన్ ఇచ్చిన నోటీసులను వ్యతిరేకిస్తూ, హై కోర్టు లో పిటీషన్ వేసాడు. దీనిని విచారించిన హై కోర్టు వేణు స్వామి పిటీషన్ ని రద్దు చేసింది. మహిళా కమీషన్ కి విచారించే హక్కులు ఉన్నాయని, న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పుకొచ్చింది. దీంతో వేణు స్వామి మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 03:39 PM IST

    Venuswami

    Follow us on

    Venuswami : వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వేణు స్వామి ఇప్పుడు వరుసగా కేసుల్లో చిక్కుకొని జైలు కి వెళ్లేందుకు అడుగు దూరం లో ఉన్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీల గురించి జాతకాల పేరుతో ఎల్లప్పుడూ అశుభాలు మాట్లాడుతూ, తద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న ఈయన, రీసెంట్ గా నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న రోజున వాళ్ళిద్దరి జాతకాలు బాగాలేవని, త్వరలోనే విడిపోతారంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో చేసి విడుదల చేసాడు. ఇది సెన్సేషన్ అయ్యింది, ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు వేణు స్వామిని తిట్టసాగారు. శుభామా అంటూ పెళ్లి చేసుకొని వస్తే, ఇలాంటి మాటలు మాట్లాడుతావా అంటూ వేణు స్వామి పై విరుచుకుపడ్డారు. ఫిల్మ్ జర్నలిస్టు సంఘాలు వేణు స్వామిపై మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేయగా, కమీషన్ విచారణకి రావాల్సిందిగా వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది.

    అయితే వేణు స్వామి మహిళా కమీషన్ ఇచ్చిన నోటీసులను వ్యతిరేకిస్తూ, హై కోర్టు లో పిటీషన్ వేసాడు. దీనిని విచారించిన హై కోర్టు వేణు స్వామి పిటీషన్ ని రద్దు చేసింది. మహిళా కమీషన్ కి విచారించే హక్కులు ఉన్నాయని, న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పుకొచ్చింది. దీంతో వేణు స్వామి మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. నేడు ఆయనకీ మహిళ కమీషన్ మరో ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 14వ తేదీన విచారణకి రావాల్సిందిగా ఆదేశించింది. మరి వేణు స్వామి కమీషన్ ఇచ్చిన ఆదేశాలను గౌరవించి విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వేణు స్వామి అరెస్ట్ అయితే టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంతో సంతోషిస్తారనే చెప్పాలి.

    ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, శోభిత, సమంత ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది సెలెబ్రిటీల గురించి నెగటివ్ గా మాట్లాడి తీవ్రమైన నెగటివిటీ ని సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తన జీవితంలో రాజకీయంగా సక్సెస్ కాలేడని, ప్రభాస్ ఈ జన్మలో ఇక హిట్టు కొట్టలేడని, రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కి భవిష్యత్తులో ఆరోగ్యం సరిగా ఉండదని, ఇలా ఎన్నో కారుకూతలు కూసేవాడు. మరోపక్క ఆయన తన భార్య శ్రీవాణితో కలిసి జర్నలిస్టు మూర్తిపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక వీడియో ని విడుదల చేసారు. దీనిపై మూర్తి కూడా వేణు స్వామి పై కేసు ఫిర్యాదు చేసాడు. త్వరలో ఈ విషయంలో కూడా వేణు స్వామి అరెస్ట్ అయ్యే ఆకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏమి జరగబోతుందో చూడాలి. తనపై జరుగుతున్న నెగటివిటీ ని చూసి ఈమధ్య కాలం లో వేణు స్వామి ఇంతకు ముందులాగ జాతకాలు చెప్పడం లేదు.