
కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిలో కొందరిని వేధిస్తున్న బ్లాక్ ఫంగస్ పై ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ ను నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. రాష్ట్రంలో దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైన తప్పకుండా ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశించింది. తెలంగాణాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పుత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ప్రతి రోజు ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం వివరించింది.