
ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న విచారణలను వ్యక్తిగత ఏజెన్సీకి అప్పగించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పరమ్ బీర్ ను సర్వీసు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విచారణల నుంచి మినహాయింపు ఇస్తూ తన కేసులను సీబీఐ లాంటి ఇండిపెండెంట్ ఏజెన్సీకి అప్పగించాలని పరమ్ బీర్ సుప్రీంను కోరారు. సుప్రీం ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించదు అని, కావాలంటే మరో చోటుకు వెళ్లవచ్చు అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది.