
ఆగస్టు 14 వ తేదీని ఒక విభజన స్మృతి దినంగా గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దేశ విభజన వల్ల కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమని ప్రధాని చెప్పారు. దేశ విభజన వల్ల కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమని ప్రధాని చెప్పారు. లక్షలాది మంది మన సోదరసోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హింస వల్ల వేలాది మంది మరణించారని, వారి కష్టాలు, త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14వ తేదీన విభజన భయానక స్మృతి దినంగా పాటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.