Spider : నిజానికి సాలె పురుగు అంటే మనలో చాలామందికి ఒక అపశకునం..”మిడతలు వాలిన చేను.. సాలె పురుగు ఉన్న ఇల్లు బాగుపడదని” పెద్దలు చెబుతుంటారు. వాస్తవానికి సాలె పురుగు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోనే గూడు కట్టుకుంటుంది. చిన్నచిన్న కీటకాలను తింటూ తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. అయితే సాలె పురుగు ఈ ప్రపంచంలోనే అత్యధికంగా తిండి తినే జంతువు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే సాలెపురుగు జాతి మొత్తం తలచుకుంటే ఏదైనా చేసేయగలదు. ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని సాలే పురుగులు ఒక ఏడాదిలో తినేయగలవు. ఇదేదో హాలీవుడ్ ఫిక్షన్ స్టోరీ కాదు. కాల్పానిక సాహిత్యం అంతకన్నా కాదు.. ఈ విషయాన్ని సెన్స్ ఆఫ్ నేచర్ జర్నల్ లో శాస్త్రవేత్తలు ప్రస్తావించారు. అందులో ప్రచురితమైన వివరాల ప్రకారం సాలెపురుగులు ఏడాదికి 400 మిలియన్ టన్నుల వరకు ఆహారాన్ని తీసుకుంటాయట. ఈ ప్రకారం చేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల బయోమాస్ కేవలం 287 మిలియన్ టన్నులు మాత్రమే. ఈ ప్రకారం చూసుకుంటే అంతకు రెట్టింపు ఆహారాన్ని సాలెపురుగులు తీసుకుంటున్నాయన్నమాట. సాలె పురుగులు తలుచుకుంటే ఏవైనా చేయగలవు అన్నమాట.
అత్యంత విషపూరితమైనవి
సాలెపురుగులు చూడ్డానికి సూక్ష్మంగా ఉన్నప్పటికీ అవి అత్యంత విషపూరితమైనవి.. వాటి లాలాజలంలో రకరకాల విషపదార్ధాలు ఉంటాయి. అవి మోతాదు మించితే ఒక మనిషి ప్రాణాన్ని సులువుగా తీసేయగలవు. వేల సంవత్సరాల క్రితం సాలెపురుగులు భారీ పరిమాణంలో ఉండేవట. అచ్చం హాలీవుడ్ సినిమాలు చూపించినట్టుగా కనిపించేవట.. అయితే కార్యక్రమంలో సాలెపురుగుల్లో పెద్ద జాతులు అంతరించిపోయాయట. ప్రస్తుతం మనం చూస్తున్న జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయట. అయితే ఆమెజాన్, ఆఫ్రికా ఖండాలలో ఉన్న దట్టమైన అడవుల్లో మాత్రం పెద్ద పెద్ద పరిమాణంలో సాలెపురుగులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సాలె పురుగులు జీవ వైవిధ్యానికి ప్రతికలు మాత్రమే కాదు.. భూమ్మీద ఉన్న మనుషులను తినేసే భక్షకులు కూడా. అయితే అంతటి ఆహారాన్ని ఇవి తీసుకొని ఎలా జీర్ణం చేసుకోగలవు? వాటి పరిమాణం చూస్తే అలా ఉండదు కదా? ఇవి తీసుకున్న ఆహారాన్ని శరీరంలో ఎక్కడ భద్రపరుచుకుంటాయి? వాటి జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కఠినమైన పదార్థాలు కూడా ఎలా జీర్ణం అవుతాయి? అనే కోణాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనలు కనుక పూర్తయితే సాలె పురుగులకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. సాలెపురుగుల జీవిత చక్రంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారని సమాచారం. కాల క్రమంలో సాలెపురుగుల జీవిత చక్రంలో చోటు చేసుకున్న మార్పులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది.