https://oktelugu.com/

యూఏఈలోనే మిగిలిన ఐపీఎల్ సీజన్

కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన వర్చువల్ జనరల్ మీటింగ్ లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత్ లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీని మరో నెల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 29, 2021 / 03:15 PM IST
    Follow us on

    కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన వర్చువల్ జనరల్ మీటింగ్ లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత్ లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీని మరో నెల రోజుల గడువు కోరనున్నట్లు బీసీసీఐ తెలిపింది.