
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం బజారు రౌడీ వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ రౌడీగా నవ్వులు వూయించబోతున్నాడు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రాన్ని ఈనెల 20వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రంలో షియాజీ షిండే, పృథ్వీ, నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాయగా ఇవి మెయిన్ హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది.