
దక్షిణాది హీరోయిన్ కు షాక్ తగిలింది. మలయాళ సినిమాల్లో నటించే సాధిక వేణుగోపాల్ సోషల్ మీడియా ఖాతా నిండా బూతు, అసభ్య అశ్లీల ఫొటోలు నింపేశారు. ఎవరో సన్నిహితులు ఫోన్ చేసి చెబితే కానీ ఆమెకు విషయం తెలియలేదు. దీనికి షాకైన నటి సాధికా చెక్ చేసుకుంది.
ఫోన్ చేసిన వ్యక్తి లింక్ కూడా సదురు నటి సాధికకు పంపాడు.. మీరే డిసైడ్ చేసుకోండి అంటూ ఆ వ్యక్తి ఆమె ఇన్ స్టాగ్రామ్ లింక్ ను షేర్ చేశాడు. దాన్ని ఓపెన్ చేస్తే హీరోయిన్ సాధిక పేరుతో అకౌంట్ ఉంది. అందులో ప్రొఫైట్ ఫొటో కూడా ఆమెదే ఉండడం విశేషం.
ఆ పేజీలో ఫొటోలన్నీ బూతుబొమ్మలే పెట్టడంతో ఆమె షాకైంది. ఇండస్ట్రీలో తనకు తెలిసిన మరో వ్యక్తికి కాల్ చేసి ఇలా ఎవరో తన పేరు తో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారని ఆమె చెప్పింది. అయితే ఇలా చేస్తూనే ఉంటారని పట్టించుకోవద్దని ఇండస్ట్రీ పెద్ద అనునయించాడు.
అయితే హీరోయిన్ సాధిక అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయం తేలాల్సిందే అంటూ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఇన్ స్టాగ్రామ్ పేజీ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ద్వారా కనిపెట్టారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి హీరోయిన్ సాధిక ముందు పెట్టారు. ఎందుకు చేశావు? అని ప్రశ్నిస్తే క్షమించమని ప్రాధేయపడ్డాడు. దీంతో సాధిక కేసును వెనక్కి తీసుకుంది. అతడిని జైలు పాలు చేసి అతడి కేరీర్ నాశనం చేయడం తనకు ఇష్టం లేదని పోలీసులకు చెప్పింది. దాంతో పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు.
తాజాగా హీరోయిన్ సాధిక ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకొని ఇలాంటివి చేయవద్దని హితవు పలికింది.
https://www.instagram.com/tv/CSMPbhSpyk8/?utm_source=ig_web_copy_link