https://oktelugu.com/

Viral Video : సీఎంను ఫొటోతీయబోయి.. మూసీలో జారిపడిన ఫొటోగ్రాఫర్‌.. వీడియో వైరల్‌!

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంగెం నుంచి రెండున్న కిలోమీటర్లు మూసీ వెంట పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కవరేజీ కోసం వెళ్లిన ఓ ఫొటో గ్రాఫర్‌ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 9, 2024 / 01:34 PM IST

    photographer slipped in the Moosi River

    Follow us on

    Viral Video :  మీడియా.. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం, సంచలనం.. ప్రమాదం జరిగినప్పుడు దీని హడావుడే ఎక్కువగా ఉంటుంది. పెళ్లిళ్లలో వధూ వరుక కన్నా.. ఈ మధ్య ఫొటో, వీడియో గ్రాఫర్లే ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. ఇది కంపరం తెప్పిస్తోంది. అలాగే ఎమ్మెలే, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, విదేశీయుల పర్యటనల్లోనూ ఫొటో, వీడియో గ్రాఫర్ల హడావుడి ఎక్కువ. వీరిని కంట్రోల్‌ చేయడానికి పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏమైనా అంటే ఫోర్త్‌ ఎస్టేట్‌.. మీడియా.. ప్రోగ్రాం బహిష్కరిస్తామంటూ బెదిరిస్తుంటారు. అయితే ఈ హడావుడిలో కొన్నిసార్లు వీఐపీలకు ప్రమాదం తెస్తుండగా, కొన్నిసార్లు ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రమాదలబారిన పడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర సందర్భంగా ఓ ఫొటో గ్రాఫర్‌ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

    ఏం జరిగిందటే..
    తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టేందుకు శుక్రవారం(నవంబర్‌ 8న) సంగెం వద్దకు చేరుకున్నారు. ముందుగా శివయ్యకు పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నది వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఓ బాటిల్‌లో నీటిని తీసుకున్నారు. ఈ సమయంలో ఓ ఫొటో జర్నలిస్తు కాస్త ముందుకు వచ్చి సీఎంను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, కాలు జారి మూసీలో పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అతడిని పట్టుకుని పైకి లేపారు. అక్కడే ఉన్న సీఎం సెక్యూరిటీలోని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కూడా ఫొటో జర్నలిస్తుకు సాంయ చేశాడు.

    సోషల్‌ మీడియాలో వైరల్‌..
    ఫొటో జర్నలిస్తు జారిపడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అంత తొందర దేనికని కొందరు కామెంట్‌ పెడుతున్నారు. విధి నిర్వహణలో జాగ్రత్త అంటూ కొందరు జన్నలిస్టులు సూచిస్తున్నారు. జర్నలిస్టుల పరిస్థితి ఇదీ అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ కూడా పెడుతన్నారు.

    ఇదిలా ఉంటే.. సంగె వద్ద ప్రారంభమైన యాత్రకు రైతులు, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ యాత్ర భీమలింగం వరకు సాగింది. సీఎంతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండాడ సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేల కూడా పాదయాత్ర చేశారు.