తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై సినిమా నటుడు ఆర్. నారాయణమూర్తి స్పందించారు. అవి తననెంతో బాధించాయని ఆయన అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ గద్దర్ మాట్లాడారు. నారాయణమూర్తికి ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. బండి లేదు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు అని అన్నారు. దీంతో నారాయణమూర్తికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారట. ఇవన్నీ తనను మానసికంగా కుంగదీశాయని ఆర్. నారాయణమూర్తి అన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర డబ్బు ఉంది. నాకు ఏదైనా అవసరం వస్తే పరిశ్రమ పెద్దలతో పాటు ఎంతో మంది సాయంచేస్తారు. సోషల్ మీడియాలో దయచేసి సత్యాన్ని మాత్రమే చాటిచెప్పండి అని నారాయణ మూర్తి అన్నారు.