https://oktelugu.com/

Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ టెస్టింగ్ మొదలు పెట్టిన మారుతి.. లీటర్ పెట్రోల్‌లో 40 కిమీ మైలేజ్

మారుతి సుజుకి స్విఫ్ట్‌కి ప్రస్తుతం 1.2-లీటర్ Z సిరీస్ ఇంజన్ తో వస్తుంది. త్వరలో ఈ హ్యాచ్‌బ్యాక్‌కు తేలికపాటి హైబ్రిడ్ సెటప్‌తో ఇంజన్ రానుంది.

Written By:
  • Rocky
  • , Updated On : November 22, 2024 / 08:52 PM IST

    Maruti Swift Hybrid

    Follow us on

    Maruti Swift Hybrid: మారుతి సుజుకి ఇటీవల చాలా మార్పులతో న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పుడు 2024 స్విఫ్ట్ హైబ్రిడ్ వంతు వచ్చింది. దీని టెస్టింగును కంపెనీ భారతీయ రోడ్లపై మొదలుపెట్టింది. మారుతి సుజుకి స్విఫ్ట్‌కి ప్రస్తుతం 1.2-లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ తో వస్తుంది. త్వరలో ఈ హ్యాచ్‌బ్యాక్‌కు తేలికపాటి హైబ్రిడ్ సెటప్‌తో ఇంజన్ రానుంది. 1.2-లీటర్ Z సిరీస్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ గ్లోబల్ మార్కెట్‌లో మారుతి సుజుకి స్విఫ్ట్‌తో అందించబడింది. ఇది బహుశా భారతీయ మార్కెట్లో త్వరలోనే రానుంది. ఈ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేసే స్టాండర్డ్ ఇంజన్ కంటే పవర్ ఫుల్. ఫోర్త జనరేషన్ స్విఫ్ట్ టెస్ట్ మ్యూల్ బెంగళూరులో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. హైబ్రిడ్ ఇంజన్‌తో స్విఫ్ట్ కొత్త కారు లీటర్ పెట్రోల్‌లో 40 కిమీ మైలేజ్ వరకు ఇవ్వనుంది.

    కొత్త తరం స్విఫ్ట్‌తో కొత్త 9-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది. ఇది కాకుండా, కొత్తగా రూపొందించిన ఏసీ ప్యానెల్లు, సెంటర్ కన్సోల్, కొత్త క్యాబిన్ థీమ్, ఆర్కిమెడిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్ , అనేక ఇతర హైటెక్ ఫీచర్లు కొత్త తరం మారుతి సుజుకితో కంపెనీ అందించచింది. 2024 స్విఫ్ట్ 5 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. అవి LXI, VXI, VXI O, ZXI, ZXI Plus.

    పండుగల సీజన్ అయినప్పటికీ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఈసారి అంతగా సందడి కనిపించలేదు. అందుకే ఈ సరికొత్త కారుపై ఇంత భారీ తగ్గింపు ఇవ్వబడుతుంది. సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్ జెడ్-సిరీస్ త్రీ-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి 112 ఎన్ ఎం పీక్ టార్క్‌తో పాటు 80 బిహెచ్‌పి పవర్ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజన్ 25.75 కిమీ/లీటర్ మైలేజీని ఇస్తుందని, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో దీని మైలేజ్ 24.80 కిమీ/లీటర్ అని కంపెనీ పేర్కొంది.

    ఇప్పటి వరకు మారుతి సుజుకి స్విఫ్ట్ సేఫ్టీ రేటింగ్ చాలా నిరాశపరిచింది,. అయితే కంపెనీ ఫోర్త్ జనరేషన్ హ్యాచ్‌బ్యాక్‌ కారు సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. దాని అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అయితే అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు కూడా అందించబడ్డాయి. కొత్త తరం స్విఫ్ట్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీ దాదాపు రూ.1,450 కోట్లు పెట్టుబడి పెట్టింది. దేశ ప్యాసింజర్ వాహన మార్కెట్ విక్రయాల్లో భారీ క్షీణత ఉంది. అన్ని కంపెనీలు ఇప్పుడు భారీ తగ్గింపులను ఇవ్వడం ద్వారా 2024 ముగిసేలోపు తమ ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి.