
మహారాష్ట్రల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయ్ గఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు. భారీ వర్షాల కారణంగా మహడ్ తలైలో కొండ చరియలు విరిగిపడ్డాయని, దీనివల్ల ఐదుగురు మరణించారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు. 15 మందిని కొండ చరియల కింద నుంచి వెలికి తీశామన్నారు. సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.