ఒలింపిక్స్‌: 9వ స్థానంలో దీపికా

టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ పూర్తయింది. ఇందులో ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్ లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు. దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సాన్ సరికొత్త రికార్డు స్పష్టించింది. ఆమె 680 స్కోరు సాధించింది. గతంలో తన పేరిటే ఉన్న […]

Written By: Suresh, Updated On : July 23, 2021 9:22 am
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ పూర్తయింది. ఇందులో ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్ లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు. దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సాన్ సరికొత్త రికార్డు స్పష్టించింది. ఆమె 680 స్కోరు సాధించింది. గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ఆమె చెరిపివేసింది. గత ఒలిపిక్స్ లో సాన్ 673 స్కోర్ రికార్డు చేసింది. 677 స్కోర్ తో జంగ్ మిన్హే, 675 స్కోర్ తో చయంగ్ కాంగ్ తర్వాత రెండు స్థానాల్లో నిలిచారు.