
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటుచేసుకున్న వరుస పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడడంతో 12 మంది అమెరికా రక్షణ సిబ్బందితో సహా సుమారు 72 మంది చనిపోయారు. 143 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అబే గేటు వద్ద చోటుచేసుకున్న పేలుడుకు సంబంధించి ఆత్మ హుతి బాంబర్ ఫొటోను ఐఎస్ విడుదల చేసింది. ఎయిర్ పోర్ట్ వద్ద నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. అనంతరం కొన్ని గంటల తర్వాత సెంట్రల్ కాబుల్ లో మరో పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం.