
బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పూత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ సుశాంత్ తండ్రి కె.కె. సింగ్ వేసిన పిటిషన్ ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ గతేడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సుశాంత్ మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ జీవితం ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా సినిమాలు తీయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో కె. కె. సింగ్ గత ఏప్రిల్ లో పిటిషన్ దాఖలు చేశారు.