
ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్ లు, పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్వేది, కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో హాజరయ్యారు. పాఠశాల భవనాల్లో రైతు భరోసా, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు వ్యాఖ్యానించింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ లో వాతావరణ కలుషితం చేస్తున్నారని ధర్మసనం మండిపడింది.