
ఏపీలో తొలి డెల్టా ఫ్లస్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ఫ్లస్ కేసు నమోదైందని తెలిపారు. అయితే డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తి అయిందని బాధితుడి నుంచి ఇతరులెవరకీ వ్యాపించలేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.