
కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో మహిళలకు కూడా స్థానం కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తన నిర్ణయాన్ని తెలియజేసింది. కాగా ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లింగ వివక్ష చూపరాదని, అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో తాజాగా కేంద్రం మహిళలకు ఎన్డీయేలో స్థానం ఇచ్చింది.