
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో సమావేశమైన ఆ పార్టీ ముఖ్యనేతలందరు కలిసి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించారు. దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎలాగైనా గెలవాలనే కాంక్షతో అందరూ కృషి చెయ్యాలని పార్టీ అధిష్టాన వర్గం పిలుపునిచ్చింది. కాగా దుబ్బాక ఉప ఎన్నికల ఇంఛార్జిగా మాజీ ఎంపీ జితేంధర్ రెడ్డి ని నియమించారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో కమిటీల నియామకం పూర్తయిందని బీజేపీకి ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని జితేంధర్ గారు తెలిపారు.