The American Party: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో కొత్త రాజకీయ పార్టీని పెట్టే సమయం అసన్నమైంది అంటూ మస్క్ పోల్ పెట్టాడు. మస్క్ పోల్ కు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభించింది. పోల్ లో పాల్గొన్న వారిలో 80 శాతం మంది మస్క్ కొత్త పార్టీ పెట్టాలంటూ మద్దతు పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మస్క్ ల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయ. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాా మస్క్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు.