Viral Video: నేటి ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని చాలామంది తాపత్రయపడుతున్నారు. రకరకాల కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో సక్సెస్ అయ్యేది కొంతమంది మాత్రమే. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అవుతున్న వారిలో చాలామంది యువతి యువకులే.
సోషల్ మీడియాలో యువత దుమ్మురేపుతున్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 70 సంవత్సరాల వ్యక్తి సంచలనం సృష్టించాడు. ఒక వీడియో లక్ష వ్యూస్ సంపాదిస్తేనే గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో.. ఆ 70 సంవత్సరాల వ్యక్తి వీడియో ఏకంగా మూడు కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ శర్మ కు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతడు గతంలో ఉద్యోగం చేశారు. పదవి విరమణ పొందిన తర్వాత కాలక్షేపం కోసం ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆయన పెట్టిన తొలి వ్లాగ్ ఏకంగా మూడు కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. అయితే ఇతడికి వ్లాగింగ్ లో పెద్దగా అనుభవం లేదు..” నాకు ఈ తరహా వీడియోలు రూపొందించడంలో పెద్దగా అనుభవం లేదు. కాకపోతే కాలక్షేపం కోసం ఇందులోకి వచ్చాను. నా ప్రయత్నాన్ని మీరంతా ప్రోత్సహిస్తారని భావిస్తున్నానని” వినోద్ కుమార్ శర్మ ఆ వీడియోలో చెప్పాడు. ఆ వీడియో కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
” మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. కాలక్షేపం కోసం కాకుండా.. పూర్తిస్థాయిలో దీనికి సమయం కేటాయించండి. ఇందులో చాలా భిన్నమైన వ్యక్తులను మీరు కలుస్తారు. మీకు వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. వాటి ఆధారంగా మీరు నడుచుకుంటే ఇక తిరిగి ఉండదు. ఎప్పుడైనా సరే వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. నేర్చుకోవడానికి పదవి విరమణ అనేది ఉండదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram