
అధికారులతో సమావేశం సందర్భంగా మాస్క్ ధరించనందుకు గాను థాయ్ లాండ్ ప్రధాన మంత్రి జనరల్ ప్రయూత్ చాన్ వో చాకు అధికారులు 6 వేల భాట్ ల సుమారు రూ. 14,270 జరిమానా విధించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల థాయ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. భారత్ నుంచి థాయ్ ప్రజలు మినహా మరెవరూ తమదేశం రావద్దని ఆంక్షలు విధించింది.