
ఏపీ లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్ కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు.