Telangana election results 2026 : ఎట్టకేలకు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎలా ఉన్నాయని చూస్తే.. కాంగ్రెస్ ఆధిక్యం.. బీఆర్ఎస్ తగ్గింది.. బీజేపీ పూర్తిగా చతికిలపడింది..
కాంగ్రెస్ 7 కార్పొరేషన్లలో 4 గెలిచింది. నిజామాబాద్ , కరీంనగర్ లో చతికిలపడింది. కొత్తగూడెంలో టై అయ్యింది. మిగతా 4 చోట్ల డామినేట్ చేసింది కాంగ్రెస్.
మున్సిపాలిటీలు చూస్తే.. నార్త్ తెలంగాణ చూస్తే.. కేవలం 6 జిల్లాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. నిర్మల్ లో ఒక మున్సిపాలిటీలో గెలిచింది. మెదక్ నాలుగింట ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. సిద్దిపేటలో నాలుగింట 1, మహబూబ్ బాద్ లో ఐదు మున్సిపాలిటీల్లో కేవలం రెండింటిలోనే కాంగ్రెస్ గెలిచింది. ఈ ఆరు ఉత్తర తెలంగాణ మినహా మిగతా అంతా కాంగ్రెస్ డామినేట్ చేసింది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏదైనా కాంగ్రెస్ దే హవా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.