Telangana intellectual movements : తెలంగాణ చరిత్ర ఉద్యమం.. నిజాం విముక్తి పోరాటం.. ఉమ్మడి ఏపీలో కలవడం.. తిరిగి పోరాటంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకూ తెలంగాణ గొప్ప యుద్ధమే చేసింది. ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ఉంది. ప్రజలతో మమేకమై.. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టులు నాడు నిజాం చేసిన పోరాటం అసమాన్యమైనది. ఆ ప్రభావం అనేక దశాబ్దాలు కొనసాగింది. అది సమాజానికి మేలు చేసింది.
ఆ తర్వాత 1980 లలో మావోయిస్టు ఉద్యమం పురుడుపోసుకుంది. ఇప్పటివరకూ పట్టి పీడించింది. యువత తమ జీవితాన్ని వృథా చేసుకొని మావోయిజం బాట పట్టారు. నాడు జమీందార్లు, పటేల్, పట్వారీలు, అగ్రవర్ణాల దోపిడీపై మావోయిస్టులు చేసిన యుద్ధం ఖచ్చితంగా పేదలకు మేలు చేసింది. తర్వాత విరసం రచయితల సంఘం.. రాడికల్ విద్యార్థి సంఘాలు, మేధో సంఘాలు తోడయ్యాయి. పరోక్షంగా మావోయిస్టు ఉద్యమాన్ని కొందరు నడిపించారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కొంత మంది నీరుగార్చారు.
ఇందులో నలుగురు ప్రొఫెసర్లు గురించి మాట్లాడుదాం.. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, సీపీఎం అనుబంధ ఎస్ఎఫ్ఐ కు ప్రెసిడెంట్ గా చేశారు. రెండో జి.హరగోపాల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రొ.కోదండరాం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. నాలుగో వ్యక్తి ప్రొఫెసర్ సీహెచ్ కాసం.. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్.
నలుగురు ప్రొఫెసర్లు తెలంగాణ సమాజాన్ని ఏ దిశకు తీసుకెళ్లారు.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
