Telangana Government Jobs: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇస్తోంది. గడిచిన ఏడాదిన్నర పాలనలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. అయితే దాని ప్రకారం నోటిఫకేషన్లు రావడం లేదు. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సర్కార్ రెండు ఏళ్ల పాలన పూర్తి కాబోతున్న వేళ, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి తెలంగాణప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే రెండు నెలల్లో సుమారు 25 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
పోలీస్ విభాగానికే ప్రధాన ప్రాధాన్యత
– డీజీపీ శివధర్ రెడ్డి ప్రకారం, పోలీస్ శాఖలో దాదాపు 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
– సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, టెక్నికల్ సిబ్బంది, కమ్యూనికేషన్ విభాగం తదితర విభాగాలకు ఈ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
– అంతేకాదు, ఆధునిక పోలీసింగ్ సదుపాయాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.
విద్యా రంగంలో కొత్త అవకాశాలు
– టీచర్ రిక్రూట్‌మెంట్ (డీఎస్సీ)తో పాటు డైట్, డిప్యూటీ డీఈవో, బీఈడీ కాలేజీ లెక్చరర్లు, ఎస్‌ఈఆర్టీ పోస్టుల కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
– రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఖాళీలు తగ్గించడంతోపాటు, నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ నియామకాలు కీలకంగా మారే అవకాశం ఉంది.
గ్రూప్ సేవల నోటిఫికేషన్లు సన్నాహాల్లో
– తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 నోటిఫికేషన్లకు కూడా తుది దశలో సన్నాహాలు పూర్తిచేస్తోంది.
– కొత్త సిలబస్, డిజిటల్ పరీక్షా పద్ధతి, పారదర్శక నియామక విధానంపై ఈసారీ ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది.
అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం
– ఉద్యోగ నియామకాలు రాజకీయ హామీల సాకార రూపంగా మాత్రమే కాకుండా, నిరుద్యోగ యువతకు పెద్ద ఉపశమనం అవుతాయి.
– గత రెండేళ్లుగా నిలిచిపోయిన తాత్కాలిక నియామకాలు తిరిగి చోదక శక్తిగా మారవచ్చు.
– ముఖ్యంగా గ్రాడ్యుయేట్, పీజీ, బీ.ఏడ్ అభ్యర్థులకు విస్తృత అవకాశాలు లభించే అవకాశం ఉంది.