Team India : దశాబ్దాల ఎదురుచూపు తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది..హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 100 కోట్లకు మించిన భారతీయుల ఆశలను నిజం చేసింది. ఏళ్ళుగా భారత అభిమానులు చేస్తున్న ప్రార్థనలను సార్ధకం చేసింది. టీమిండి గెలిచిన తర్వాత దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. సాధారణంగా క్రికెట్ అంటే మనదేశంలో చాలామంది ఇష్టపడుతుంటారు. మన జట్టు విజయాలు సాధిస్తే ఎగిరి గంతులు వేస్తుంటారు. అటువంటిది ఏకంగా తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధిస్తే వారు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులే కాదు, చివరికి స్టార్ స్పోర్ట్స్ గ్రూపులో పనిచేసే ఉద్యోగులు కూడా టీమిండియా విజయాన్ని గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారు.
స్టార్ స్పోర్ట్స్ ప్రస్తుతం ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించింది. ప్రాంతీయ భాషల్లో కూడా కామెంట్రీ చెప్పడం మొదలుపెట్టింది. ఈ విధానాన్ని మిగతా చానల్స్ కూడా అనుసరిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ప్రాంతీయ భాషలలో కూడా కామెంట్రిని చెప్పడం మొదలుపెట్టింది. తమిళం నుంచి మొదలు పెడితే తెలుగు వరకు ప్రాంతీయ భాషలలో కామెంట్రీ చెప్పడంతో టీవీలలో, ఓటీటీలలో చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ ఛానల్స్, ఓటీటీ కి కనివిని ఎరుగని స్థాయిలో వ్యూస్ లభించాయి. ఫైనల్ మ్యాచ్ ను అయితే కోట్లల్లో అభిమానులు చూశారు. సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.. ప్రాంతీయ భాషలలో కామెంట్రీ చెప్పేవాళ్లంతా కూడా మాజీ క్రికెటర్లు కావడం విశేషం. అయితే టీమిండియా విజయాన్ని వారు గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు.
హిందీ, తెలుగు, తమిళం భాషల్లో కామెంట్రేటర్లు టీమిండియా విజయం సాధించిన తర్వాత గర్వంతో ఉప్పొంగిపోయారు. బరువైన పదాలు వాడుతూ.. టీమిడియా విజయాన్ని గొప్పగా కీర్తించారు.. అద్భుతమైన విజయం టీమిండియా అందుకుందని.. 100 కోట్లకు మించిన ప్రజల ఆకాంక్షలను నిజం చేసిందని పేర్కొన్నారు.. ముఖ్యంగా తెలుగు భాషలో సుమన్, ఆశిష్, వింధ్య విశాఖ చేసిన కామెంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలను స్టార్ స్పోర్ట్స్ గ్రూపు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. అసలు టీమిండియా గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులు ఆ వీడియోలను కూడా తెగ చూడడం మొదలుపెట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం లక్షలలో వీక్షణలు సొంతం చేసుకొని సరికొత్త రికార్డులను సృష్టించాయి. మనదేశంలో క్రికెట్ అంటే ప్రజలు విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. చివరికి స్టార్ స్పోర్ట్స్ గ్రూపులో చానల్స్ లో వ్యాఖ్యాతలు చేసిన కామెంట్రీ ని కూడా ఇష్టపడ్డారు. వారు లైవ్ లో మాట్లాడుతున్న వీడియోలను కూడా విపరీతంగా ప్రేమించారు. దీనిని బట్టి మనదేశంలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
United we stand, unstoppable we rise! ✨
Rewatch Team India’s World Cup-winning moment in Hindi, Tamil & Telugu – the perfect blend of emotion, pride, and pure jazba! #CWC25 #INDvSA pic.twitter.com/fmn3H93ABF
— Star Sports (@StarSportsIndia) November 3, 2025