Jr NTR : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఎన్ని సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు కొంతమంది కొన్ని సినిమాలతో సంపాదించుకుంటూ ఉంటారు. కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి…ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా ప్లాప్ లు రావడంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. నిజానికి ఒక రెండు సినిమాలు చేయకుండా రిజెక్ట్ చేసి ఉండాల్సింది… అందులో ఒకటి నరసింహుడు సినిమా కాగా, మరొకటి నా అల్లుడు ఈ రెండు సినిమాలు చేసి ఆయన పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే అదే స్లాట్ లో రెండు సక్సెస్ ఫుల్ సినిమాలను ఆయన వదిలేసుకోవాల్సి వచ్చింది.
అందులో ఒకటి భద్ర సినిమా కాగా, మరొకటి అల్లు అర్జున్ హీరోగా చేసిన బన్నీ సినిమా కావడం విశేషం… ఇక ఈ రెండు సినిమాలు చేసి ఉంటే బాగుండేది. ఆయన సక్సెస్ రేటు పెరగడమే కాకుండా రెండు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసిన ఫీల్ కూడా వచ్చేది… ఆ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించినట్లయితే ఎన్టీఆర్ కి మరికొన్ని మంచి సినిమాలు వచ్చేవి…
వాటి ద్వారా ఆయన ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరికంటే కూడా టాప్ పోజిషన్ లో ఉండడానికి అవకాశం దొరికేది. కానీ ఎన్టీఆర్ మాత్రం అలాంటి సినిమాలు చేయకుండా నరసింహుడు, నా అల్లుడు లాంటి సినిమాలను చేసి తన కెరియర్ ను తనే చేజేతులారా పోగొట్టుకున్నాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు ఎన్టీఆర్ ని విమర్శిస్తూ ఉంటారు…
ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది… డ్రాగన్ సినిమాతో కనక ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకుంటే మాత్రం ఎన్టీఆర్ కి గొప్ప మార్కెట్ క్రియేట్ అవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోతాడు…