T20 World Cup 2026 : మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. 2024లో టి20 వరల్డ్ కప్ టీమిండియా సాధించింది. ఆ టోర్నీలో టీమిండియా మీద అంచనాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు టీమిండియా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు గొప్ప గొప్ప జట్లు ఉన్నప్పటికీ అందరూ కూడా ఇండియానే టైటిల్ ఫేవరెట్ అని పిలుస్తున్నారు. దీని అంతటికి ప్రధాన కారణం ఈ ఆరుగురు ఆటగాళ్లు.
టీమిండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబె, రింకూ సింగ్ వంటి వారితో బ్యాటింగ్ లైన్ అప్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఒకవేళ సంజు శాంసన్ కనుక ఫామ్ లో ఉండి ఉంటే భారత బ్యాటింగ్ ఇంకా అత్యంత బలంగా ఉండేది. అక్టోబర్ 2023 నుంచి భారత జట్టు ఆడిన అన్ని టి20లలో ఆటగాళ్లు 1081 సిక్సర్లు కొట్టారు. ఒక్కో సిక్సర్ కు 10.99 బంతుల రేటు నమోదయిందంటే భారత బ్యాటింగ్ ఎంత ఫలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వరుసలో 11.91 బంతులతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది.. 12.18 బంతులతో వెస్టిండీస్, 13.5 4 బంతులతో సౌత్ఆఫ్రికా, 14.39 బంతులతో న్యూజిలాండ్, 14.81 బంతులతో ఇంగ్లాండు, 15.38 బంతులతో ఆప్ఘనిస్తాన్, 16.50 బంతులతో పాకిస్తాన్, 17.78 బంతులతో శ్రీలంక జట్టు తదుపరి స్థానాలలో ఉన్నాయి.
టీమిండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా కొనసాగిస్తున్నాడు. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు అతడు తను ఆడిన టి20 మ్యాచ్లలో ఏకంగా 249 సిక్సర్లు కొట్టాడు. ఈ ప్రపంచకప్ లో ఆడుతున్న అందరి క్రికెటర్లకంటే అతడు కొట్టిన సిక్సర్లు ఎక్కువ. అతడి సిక్స్ ఫ్రీక్వెన్సీ 6.78 బంతులుగా నమోదయింది. దీనినిబట్టి అతడు ఏ స్థాయి ఫామ్ లో ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు. సమకాలీన క్రికెట్లో 200 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా అతడే కావడం విశేషం. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ (101 సిక్సర్లు: ప్రతి సిక్స్ కు 9.64 బంతులు), హార్దిక్ పాండ్యా (89 సిక్సర్లు, ప్రతి సిక్స్ కు 10.47 బంతులు), శివం దుబే(111 సిక్సర్లు, ప్రతి సిక్స్ కు 10.67 బంతులు) తర్వాత స్థానాలకు కొనసాగుతున్నారు. అభిషేక్ శర్మ తర్వాత అలెన్(న్యూజిలాండ్, 179 సిక్సర్లు), బ్రేవిస్ (153 సిక్సర్లు), రుమారియో షెఫర్డ్ (116 సిక్సర్లు), మాక్స్ వెల్(126 సిక్సర్లు), రషీద్ ఖాన్(58 సిక్సర్లు), డేవిడ్ (160 సిక్సర్లు), హోల్డర్ (84 సిక్సర్లు), ఇషాన్ కిషన్(101 సిక్సర్లు) అభిషేక్ శర్మ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.