Anakapalli train accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి ప్రాంతంలో టాటానగర్ (జార్ఖండ్) నుంచి ఎర్నాకులం (కేరళ) వెళ్తున్న ఎక్స్ ప్రెస్ (18189) ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని రైల్వే శాఖ ఒక ప్రాంతంలో తెలిపింది. మంటలు వ్యాపించిన తర్వాత.. అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించిందని.. అందువల్లే మంటలు అదుపులోకి వచ్చాయని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు
టాటానగర్ నుంచి
టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలో లోకో పైలట్ గుర్తించాడు. వెంటనే రైలును ఆపి వేశాడు. మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు హాహా కారాలు చేశారు. ప్రయాణికులు బయటకు దిగి బతుకు జీవుడా అనుకుంటూ తన ప్రాణాలను కాపాడుకున్నారు. దీంతో లోకో పైలట్ చాకచక్యంగా స్పందించాడు. కాలిపోతున్న బోగీలను వెంటనే రైలు నుంచి తప్పించాడు. ఈ సమాచారం అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి ప్రాంతానికి చెందిన అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలిసింది. వారి వెంటనే అక్కడికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటల తాకిడి వల్ల
మంటల తాకిడి వల్ల ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మిగతా వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. బీ1 కోచ్ లో మాటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అర్ధరాత్రి మూడు గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన ఆ బోగిలను తొలగించారు. అందులో ప్రయాణికులను మిగతా బోగీ లలో సర్దుబాటు చేశారు.
ప్రమాదానికి కారణం అదే
ఈ ఘటన జరిగిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ క్షేత్రస్థాయికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. ” బోగీ లో దుప్పట్లు ఉండడంవల్ల మంటలు వ్యాపించాయి. బీ1,బీ2 బోగీ లు పూర్తిగా మంటలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు బి1 లో 76, బీ2 లో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. బీ1 లో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు ఒక్కసారిగా స్టక్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లోకో పైలట్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా పరిశీలన జరగాల్సి ఉంది. ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించామని” మోహిత్ పేర్కొన్నారు.
చనిపోయిన వ్యక్తి నేపథ్యం
ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి పేరు చంద్రశేఖర్ సుందర్ అని అధికారులు పేర్కొన్నారు. అతడి వయసు 70 సంవత్సరాలు. రైలు ప్రమాదానికి గురి కావడంతో మిగతా స్టేషన్లలో ప్రయాణికులు చలిలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రైలు కోసం వేచి ఉండడంతో రైల్వేస్టేషన్లు కిటకిట లాడిపోయాయి. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో పూడి తిరుపతి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, బెంగళూరు హంసఫర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.