అత్యాచారం కేసులో తరుణ్ తేజ్ పాల్ కు విముక్తి

తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్ పాల్ కు అత్యాచారం కేసులో ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి ఆరోపణల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. నెల 19 నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రెండు, మూడో రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు. 2013 లో జరిగిన థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్ పాల్ తనై […]

Written By: Suresh, Updated On : May 21, 2021 11:52 am
Follow us on

తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్ పాల్ కు అత్యాచారం కేసులో ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి ఆరోపణల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. నెల 19 నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రెండు, మూడో రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు. 2013 లో జరిగిన థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్ పాల్ తనై లైంగిక వేధింపులకు పాల్పడాటంటూ తెహల్కా కామ్ కే చెందిన ఓ మహిళా జర్నలిస్టు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్ పాల్ కేసు నమోదు చేసి గోవా పోలీసులు 2013లో ఆయనను అరెస్ట్ చేశారు.