Tamil Nadu Elections : తమిళనాడులో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. తమిళనాడులో 1.25 లక్షల మందితో ఒక సర్వే చేశారు. నిన్న ప్రధాన ఘటన జరిగింది. అన్నామలై తన ఆరు నియోజకవర్గాల ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ రెండు విషయాలు చర్చిద్దాం
తాజాగా స్పిట్ మీడియా అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 10 వరకూ సర్వే తమిళనాడులో నిర్వహించింది. ఎన్డీఏలో బీజేపీ, అన్నాడీఎంకే భాగస్వాములు. పీఎంకే చేరలేదు. సౌత్ లో టీటీకే దినకరణ్ చేరలేదు. ఈ రెండూ చేరకుముందు జరిపిన సర్వే. ఏ విధంగా ఉందని చూస్తే.. ఎన్డీఏ స్పష్టమైన ముందంజలో ఉంది. ఏడీఎంకేకు ఆధిక్యత ఉంది. వారికి సర్వేలో ఏడీఎంకేకు 104 సీట్లు, 35.13 శాతం ఓట్లు.. రూలింగ్ లోనే డీఎంకేకు 88 సీట్లు, 35.83 శాతం ఓట్లు, టీవీకే విజయ్ పార్టీకి 5 సీట్లే గెలుస్తుంది.. 17.15 శాతం ఓట్లు.. ఎన్టీకే 6 శాతం ఓట్లు వస్తాయి.. సీట్లు రావు.
ఇందులో గట్టి పోటీలో 37 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారన్నది చెప్పడం లేదు. టీవీకేకు ప్రాంతాల వారీగా వివరాలు ఇచ్చారు. మొత్తం 17శాతం వచ్చినా.. చెన్నై జోన్ లో 28 శాతం, నార్త్ లో 16, కొంగూర్ లో 15, సౌత్ లో 14, డెల్టాలో 13 శాతం ఓటింగ్ టీవీకే విజయ్ కు వస్తుంది.
తమిళ నాడు ఎన్నికల్లో NDA కూటమి ముందంజ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
