
అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. రెండూ జట్లూ ఒకే గ్రూపులో చోటు సంపాదించుకోవడమే అందుకు కారణం. అయితే, మ్యాచ్ ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి ప్రపంచకప్ లో ఐసీసీ మొత్తం నాలుగు గ్రూప్ లను ఏర్పాటు చేసింది. గ్రూప్ -2లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది. కాగా, ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ, ఒమన్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.