
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను రీ షెడ్యూల్ చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి లీగ్ ను తిరిగి ప్రారంభించాలని బీసీీసీఐ నిర్ణయించింది. టోర్నమెంట్ మూడు వారాల పాటు జరుగుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. దీంతో సెప్టెంబర్ లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ 20 సిరీస్ ను కూడా రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఐతే ఐపీఎల్ 2021 కొత్త షెడ్యూల్, సౌతాప్రికాతో టీ 20 సిరీస్ పై బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.