
తెరాస మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటి వరకు తనకు కలవలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే తనను కలసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ఇద్దరం 15 ఏళ్లు కలిసి పనిచేశామని, ఇప్పుడు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కలిసినంత మాత్రాన పార్టీలో చేరుతారని అనుకోలేమన్నారు. ఇద్దరం ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని ఈటల తనతో చెప్పారన్నారు.