
మే 20న మళ్లీ తెలంగాణ కేబినెట్ మరోసారి సమావేశం కానుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై అదే రోజు నిర్ణయం తీసుకోనున్నారు. టీకా కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ లోనూ రెమ్ డెసివిర్, ఆక్సిజన్, కరోనా మందుల్ని అందుబాటులోకి తేవాలని సీఎస్ ను తెలంగాణ కేబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయించారు.