
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.